న్యూఢిల్లీ: ఇక నుంచి అన్ని రకాల ప్యాసింజర్ కోచ్‌లలో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సీసీటీవీల ఏర్పాటుపై చేపట్టిన ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో పై నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ తెలిపింది.
శనివారం సీనియర్ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సీసీటీవీల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసినట్టు రైల్వే శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.