న్యూఢిల్లీ, అక్టోబర్ 26: 2024 సంవత్సరానికి గాను ఎంబీఏలో క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ను బుధవారం ప్రకటించారు. ఇందులో టాప్-250లో 10 భారత విద్యాసంస్థలకు చోటు దక్కింది. ఐఐఎం బెంగళూరు 48, ఐఐఎం అహ్మదాబాద్ 53, ఐఐఎం కలకత్తా 59 స్థానాల్లో నిలిచాయి.
స్టాన్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, పెన్(వార్టన్), హార్వర్డ్ బిజినెస్ స్కూల్ జాబితాలో మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. టాప్-250 జాబితాలో చోటు దక్కించుకొన్న భారత విద్యా సంస్థల్లో ఐఐఎం ఉదయ్‌పూర్, ఐఐఎం ఇండోర్, ఐఐఎం లక్నో, ఐఎస్బీ గురుగ్రామ్, ఐఎంఐ కోల్‌కతా, ఎక్స్ఎల్ఆర్ఐ-గ్జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, జంషెడ్పూర్ ఉన్నాయి.