బెంగళూరు: బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఖైదీలకు వీఐపీ సౌకర్యాలు కల్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జైళ్ల శాఖ డీజీ దయానంద శుక్రవారం విచారణకు ఆదేశించారు.
బంగారం అక్రమ రవాణా కేసులో ఖైదీగా ఉన్న తరుణ్ మొబైల్ ఫోన్ వాడుతూ, టీవీ చూస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అలాగే ఉమేశ్ రెడ్డి అనే లైంగిక వేధింపుల కేసు ఖైదీకి జైల్లో అనేక సౌకర్యాలు కల్పించిన చిత్రాలు సోషల్ మీడియాలో కనిపించాయి.