గుజరాత్లో నాణ్యత లేని ఫ్లైఓవర్
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నాణ్యత లేని ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన కేసులో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన నలుగురు డైరెక్టర్లను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను సెషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తిరస్కరించడంతో ఆదివారం రాత్రి లొంగిపోయారు.
- నిర్మాణ సంస్థ డైరెక్టర్ల అరెస్టు
అహ్మదాబాద్, మే 29: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నాణ్యత లేని ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన కేసులో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన నలుగురు డైరెక్టర్లను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను సెషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తిరస్కరించడంతో ఆదివారం రాత్రి లొంగిపోయారు. ఖొఖరా పోలీసుస్టేషన్ పరిధిలోని హత్కేశ్వర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి నాసిరకం మెటీరియల్ వాడారనే ఆరోపణలు ఉన్నాయి.
ఐదేండ్ల క్రితం నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రస్తుతం ప్రజలకు ప్రమాదకరంగా మారింది. దీంతో దీన్ని కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. 2017లో ప్రారంభించిన ఈ వంతెన.. దెబ్బతినడం వలన కేవలం 4-5 ఏండ్లలోనే మూసివేశారు. ైనిర్మాణంలో నాణత్య లేని కాంక్రీట్, సిమెంట్ వాడారని స్వతంత్ర సంస్థల దర్యాప్తులో తేలిందని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) గుజరాత్ హైకోర్టుకు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

