న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరీ( Renuka Chowdhury) ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌కు వచ్చే క్రమంలో ఓ వీధి కుక్కను తనవెంట తీసుకొచ్చారు. తన కారులో ఆ వీధు శునకాన్ని తెచ్చారు. అయితే కాంగ్రెస్ ఎంపీ డ్రామా ఆడుతున్నట్లు అధికార ఎంపీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎంపీ రేణుకా చౌదరీ స్పందించారు. సభలో కూర్చున్నవాళ్లు కరుస్తారని, శునకాలు కాదు అని ఆమె అన్నారు. ఓ వీధి కుక్కనువెటర్నరీ క్లినిక్‌కు తీసుకెళ్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రభుత్వానికి జంతువులు అంటే ఇష్టం లేదని, వీధి కుక్కలను రక్షించే చట్టాలు లేవని ఆమె అన్నారు.
జంతువులకు స్వరం ఉండదని, ఆ శునకం తన కారులో ఉందని, వాళ్లకు దీనితో సమస్య ఏంటని అన్నారు. అదో చిన్న జంతువు అని, అదేమైనా కరుస్తుందా, పార్లమెంట్ లోపల కూర్చునేవాళ్లు కరుస్తారని, కానీ కుక్కలు కాదన్నారు. కారులో ఉన్న శునకం గురించి ప్రశ్న వేయగా ఆమె స్పందిస్తూ.. ఏ చట్టం ప్రకారం కుక్కలను రక్షించవద్దు అని నిలదీశారు.
ఎంపీ రేణుకా చౌదరి ఓ డాగ్ లవర్. ఆమె ఇంట్లో చాలా పెంపుడు జంతువులు ఉన్నాయి. పార్లమెంట్లో తనను విడిచిపెట్టిన తర్వాత ఆ శునకాన్ని వెటర్నరీ క్లినిక్‌కు తన డ్రైవర్ తీసుకెళ్లనున్నట్లు ఎంపీ రేణుక తెలిపారు. రేణుక వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ ఎంపీ తమాషా చేస్తున్నట్లు బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ ఆరోపించారు.
పార్లమెంట్‌కు శునకాన్ని తీసుకొచ్చి ఆమె ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపించారు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా ఎవర్నీ పార్లమెంట్ లోపలికి తీసుకురావద్దు అని అన్నారు. సభలో చర్చలు నిర్వహించేందుకు ఆసక్తి లేదు కానీ పార్లమెంట్లో తమాషా చేస్తున్నారన్నారు.
#ParliamentWinterSession | Delhi: On the controversy over bringing a dog to Parliament, Congress MP Renuka Chowdhary said, “Is there any law? I was on my way. A scooter collided with a car. This little puppy was wandering on the road. I thought it would get hit. So I picked it… pic.twitter.com/fNPkCMfOyX
— ANI (@ANI) December 1, 2025