న్యూఢిల్లీ: మోదీ మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య రానురానూ పెరుగుతున్నది. 2014లో మొదటిసారి ఆయన ప్రధాని పదవిని చేపట్టినపుడు ఆయన క్యాబినెట్లో 46 మంది మంత్రులు ఉండేవారు. రెండోసారి 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు ఆ సంఖ్య 58కి పెరిగింది. తాజాగా అది 72కు చేరింది.2019-2024 పర్యాయంలో 2021లో మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. దీంతో మంత్రుల సంఖ్య 78కి పెరిగింది. నిబంధనల ప్రకారం గరిష్ఠంగా 81 మంది మంత్రులను నియమించేందుకు అనుమతి ఉంటుంది.