FASTag | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) కొత్త నిబంధనలు తీసుకువస్తున్నది. టోల్ గేట్ల వద్ద లావాదేవీలు సులువుగా జరిగేలా, మోసాలు నివారించేలా తీసుకువచ్చిన ఈ నిబంధనలు ఫిబ్రవరి 17 నుంచి అన్ని టోల్ ప్లాజాల వద్ద అమలులోకి రానున్నాయి.
1. వాహనం టోల్ బూత్‌కు చేరడానికి ముందు 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ అయి ఉన్నా, హాట్‌లిస్ట్‌లో ఉన్నా, బ్యాలెన్స్ తక్కువగా ఉన్నా టోల్ బూత్ వద్ద ఫాస్టాగ్ లావాదేవీ విఫలమవుతుంది.
2. టోల్ బూత్ వద్ద స్కాన్ చేసిన 10 నిమిషాల వరకు ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నా, ఇన్‌యాక్టివ్‌గా ఉన్నా లావాదేవీ తిరస్కరణకు గురవుతుంది. ఈ రెండు సందర్భాల్లో 176 ఎర్రర్ కోడ్‌తో లావాదేవీ విఫలమవుతుంది. వాహనానికి జరిమానా కింద రెట్టింపు టోల్ చార్జ్ పడుతుంది.