న్యూఢిల్లీ, జనవరి 21: వైద్య కళాశాలల్లో అధ్యాపకుల అర్హతకు సంబంధించిన నిబంధనలను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సడలించింది. మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు 220 పడకలున్న బోధన, బోధనేతర ప్రభుత్వ దవాఖానలలో నాలుగేండ్ల అనుభవం ఉన్న నాన్ టీచింగ్ కన్సల్టెంట్లు, స్పెషలిస్టులు, మెడికల్ ఆఫీసర్లు ఇక నుంచి అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులవుతారని ఎన్ఎంసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
అయితే దీనికి ముందు బయోమెడికల్ రిసెర్చిలో ప్రాథమిక కోర్సు (బీసీఎంఆర్) తప్పనిసరిగా పూర్తి చేయాలి. దీనికి సంబంధించిన నూతన నిబంధనలు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచారు.