ముజఫర్‌నగర్, ఆగస్టు 8 : అదృశ్యమైన అక్కాచెలెళ్లు తమ కుటుంబ సభ్యులకు షాకిచ్చారు. పెండ్లి చేసుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారు తామిద్దరం పెండ్లి చేసుకున్నామని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటన యూపీలోని ముజఫర్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమర ఉజల అనే వ్యక్తి తన కుమార్తె మిస్సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెను కజిన్ అపహరించి ఉంటుందని, అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఆమె కజిన్ కూడా అదృశ్యమైనట్టు తెలిసింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఉజల కుమార్తె ఆచూకీ తెలుసున్నారు.
అయితే తనకు రక్షణ కల్పిస్తేనే వస్తానని అనడంతో వారు అంగీకరించారు. దీంతో గురువారం తన సోదరితో కలిసి ఆమె పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఇద్దరూ పెండ్లి బట్టల్లో ఉన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ముందే తాము గుడిలో వివాహం చేసుకున్నామని, తమలో ఒకరు భర్తగా, మరొకరు భార్యగా భవిష్యత్తులో జీవిస్తామని, తమ బంధం ఏడాదిన్నరగా ఉందని, దానిని కొనసాగించాలని ఇద్దరూ నిర్ణయించామని వారు తెలిపారు. ఇప్పటివరకు తాము అక్కాచెల్లెళ్లమని, ఇక నుంచి భార్యాభర్తలమని పేర్కొన్నారు.