Pentagon | మైక్రోసాఫ్ట్ విండోస్ లేటెస్ట్ వెర్షన్‌ను అమెరికాలోని ప్రభుత్వ, పోలీసు, రక్షణ విభాగాలు కూడా వినియోగిస్తున్నాయి. తాజాగా సమస్య ఎదురవ్వడంతో ఆ విభాగాలతో పాటు అగ్రరాజ్య భద్రతా కార్యాలయం పెంటాగాన్లోనూ పలు కంప్యూటర్లు మొరాయించాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
పారిస్ ఒలింపిక్స్‌పైనా ప్రభావం
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సమస్య ప్రభావం.. మరో వారంలో ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్ 2024పైనా పడింది. కంప్యూటర్లు షట్‌డౌన్ కావడంతో నిర్వహణకు సంబంధించిన ఐటీ కార్యకలాపాల్లో అంతరాయం ఏర్పడినట్టు ఆర్గనైజర్లు పేర్కొన్నారు. అయితే, సమస్యను పరిష్కరించినట్టు వెల్లడించారు.