పుణె, మే 25: పుణెలోని పోర్సే కారు ఘటనలో తాజాగా నిందితుడి తాతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 28 వరకు అతడికి పోలీస్ కస్టడీ విధించారు.
నిందితుడి స్థానంలో తన ఇంటి డ్రైవర్ను ఉంచడానికి అతడి తాత బెదిరింపులు, ప్రలోభాలతో ప్రయత్నించారని ఫిర్యాదులు వచ్చాయి.