ఆరో విడతలో 59% పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా జరిగిన ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం రాత్రి 7.45 గంటల వరకు 59.06 శాతం పోలింగ్ నమోదైంది.
- పశ్చిమ బెంగాల్లో అధికం.. ఢిల్లీలో అత్యల్పం
- ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
- బెంగాల్లో స్వల్ప ఉద్రిక్త ఘటనలు
న్యూఢిల్లీ, మే 25: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా జరిగిన ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం రాత్రి 7.45 గంటల వరకు 59.06 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా బెంగాల్లో 52 శాతం, అత్యల్పంగా ఢిల్లీలో 34.4 శాతం ఓటింగ్ నమోదైంది. ఆరోవిడత ఎన్నికల్లో ఆరు రాష్ర్టాలు, రెండు యూటీల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఢిల్లీలోని 7 లోక్‌సభ నియోజక వర్గాలు, యూపీలో 14, హర్యానాలోని మొత్తం 10, బీహార్, పశ్చిమ బెంగాల్లో 8 చొప్పున, ఒడిశాలో 6, జార్ఖండ్‌లో 4, జమ్ము-కశ్మీర్లో ఒక నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు ఒడిశాలోని 42 అసెంబ్లీ నియోజవర్గాలు, హర్యానాలోని కర్నల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరిగింది.
ఓటేసిన రాష్ట్రపతి, ప్రముఖులు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు ఆరో విడత ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతితో పాటు ఉప రాష్ట్రపతి ధన్కర్, కేంద్ర మంత్రులు ఎస్.జయశంకర్, హర్దీప్ సింగ్ పురి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ మంత్రి అతిశీ, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఓటేశారు. పోలింగ్ బూత్‌లో తొలి పురుష ఓటర్‌గా ఓటు హక్కును వినియోగించినందుకు అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్‌ను మంత్రి జయశంకర్ షేర్ చేశారు.
బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
ఎన్నికల సందర్భంగా బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. జర్గ్రామ్ బీజేపీ అభ్యర్థి ప్రణత్ తుడుపై రాళ్ల దాడి చేయడంతో ఆయన భయ ంతో పరుగులు తీశారు. కాగా, ఈవీఎం మొరాయించిందని సీపీఐ(ఎం) నేత బృందా కారత్, తమవారిని అడ్డుకోవడంపై మెహబూ బా ముఫ్తీ నిరసన తెలిపారు.

ఢిల్లీలో ఓటేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి ధన్కర్, కేంద్ర మంత్రి ఎస్.జయశంకర్, సీఈసీ రాజీవ్‌కుమార్, భార్య కల్పనతో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, ప్రియాంక వాద్రా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

