న్యూఢిల్లీ/కోచి, సెప్టెంబర్ 8: కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె టీ వీణా, అతని అల్లుడు పీఏ మహమ్మద్ రియాజ్‌లపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆ రాష్ట్ర డీజీపీకి మంగళవారం విజ్ఞప్తి చేసింది.
విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) అనే మైనింగ్ సంస్థ ఐటీ కన్సల్టెన్సీ సేవల ముసుగులో ఆయన కుమార్తె వీణాకు చెందిన ఎక్సలాజిక్ సొల్యూషన్స్ సంస్థ (ప్రస్తుతం మూతపడి ఉంది)కు రూ.2.88 కోట్లు అక్రమంగా చెల్లింపులు జరిపినట్టు ఈడీ ఆరోపించింది. మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆధారాలు లభ్యమైనందున వారిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలని డీజీపీని ఒక లేఖలో కోరింది.