న్యూఢిల్లీ : సమాజంలో ఎన్నో సంస్కరణలు వచ్చినా, మహిళల సాధికారత పెరుగుతున్నా.. వ్యాపారంగా మారిపోయిన వివాహం, సామాజిక అత్యాశ మహిళలను వరకట్న దురాచారానికి సమిధలుగా మారుస్తున్నాయి. విద్యావంతులు, సంపాదనపరులైన మహిళలు కూడా వరకట్న వేధింపులకు తాళలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
వరకట్న నిషేధ చట్టం సరిగ్గా అమలు కాకపోవడం, వేధింపులపై కేసులు సరిగా నమోదు కాకపోవడం, నమోదైన వాటిలో శిక్షలు పడిన కేసుల సంఖ్య కేవలం 4 శాతం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.