న్యూఢిల్లీ: సీబీఐకి సమాచార హక్కు చట్టం నుంచి సంపూర్ణ మినహాయింపు లేదని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేందుకు ఈ చట్టం అనుమతి ఇచ్చిందని చెప్పింది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సంజీవ్ చతుర్వేది కోరిన సమాచారాన్ని అందజేయాలన్న సీఐసీ 2019 నాటి ఆదేశాల్ని హైకోర్టులో సీబీఐ సవాల్ చేయగా, సీఐసీకి అనుకూలంగా తీర్పు వెలువరించింది.