Airspace | న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 : పహల్గాం ఘటన అనంతరం పాకిస్థానపై భారత్ విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా భారత్ నుంచి వచ్చే విమానాలకు ఆ దేశం తన గగనతలాన్ని మూసివేయడంతో ఆ ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడనుంది. ముఖ్యంగా ఢిల్లీ, ఇతర ఉత్తర ప్రాంత నగరాల నుంచి బయలుదేరే విమానాలు తాము చేరుకునే గమ్యస్థానాల దూరం పెరగనుంది.
దీంతో రానున్న రోజుల్లో 8-12 శాతం విమాన చార్జీలు పెరిగే అవకాశం ఉంది. పాకిస్థాన్ చర్య తమ అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడిందని ఎయిర్ ఇండియా, ఇండిగో గురువారం ప్రకటించాయి. ఈ రెండు సంస్థలతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, స్పైస్జెట్లు కూడా అంతర్జాతీయ సర్వీసులను నిర్వహిస్తున్నాయి.