న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ క్రమంగా కోరలు చాస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 1 ఉదయం 8 గంటల సమయానికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,758కి పెరిగింది. వీటిలో అత్యధికంగా కేరళలో 1400 కేసులు, మహారాష్ట్రలో 485, ఢిల్లీలో 436 కేసులు ఉన్నాయి.
కొవిడ్‌తో గత 24 గంటల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు కేరళకు చెందినవారు కాగా, మరొకరు కర్ణాటకకు చెందినవారు. కొవిడ్ కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 28కి పెరిగింది.