న్యాయం అతికొద్ది మందికే
- దేశంలో మెజారిటీ ప్రజలకు అందని ద్రాక్షే
- న్యాయం అందితేనే దాస్య విమోచనం
- భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ, జూలై 30: దేశంలో ఇప్పటికీ న్యాయస్థానాలు అతికొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మెజారిటీ ప్రజలకు న్యాయవ్యవస్థను ఉపయోగించుకోవటంపై అవగాహనే లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తంచేశారు.
న్యాయవ్యవస్థను సమర్థంగా ఉపయోగించుకొన్నప్పుడే పేదలకు దాస్య విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు. తొలి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్విస్ అథారిటీస్ సమావేశంలో శనివారం ఆయన ప్రసంగించారు. అత్యధిక మంది ప్రజలకు న్యాయ వ్యవస్థను చేరువ చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు.
అండర్ ట్రయల్కు అధిక ప్రాధాన్యం
జైళ్లలో దీర్ఘకాలంగా మగ్గిపోతున్న అండర్ ట్రయల్ ఖైదీలకు సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించి, వారికి విముక్తి కలిగించటమే న్యాయవ్యవస్థకు ప్రస్తుతం ప్రధాన్యాంశమని జస్టిస్ రమణ అన్నారు. ‘అసమానతలను రూపుమాపటం అనే లక్ష్యంమీదనే ఆధునిక భారతదేశం నిర్మితమైంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ భాగస్వామ్యం ఉండాలి. సామాజిక రుగ్మతలను రూపుమాపకుండా ఇది సాధ్యం కాదు. న్యాయవ్యవస్థను ఉపయోగించుకోవటం సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ఓ చక్కని దారి. అండర్ట్రయల్స్కు సముచిత విముక్తి కల్పించేందుకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) క్రియాశీలకంగా పనిచేస్తున్నది’అని పేర్కొన్నారు.
డిస్ట్రిక్ట్ జ్యుడీషియరీయే వెన్నెముక
భారతదేశ ప్రజాస్వామ్యానికి డిస్ట్రిక్ట్ జ్యుడీషియరీయే వెన్నెముక అని సీజేఐ రమణ అన్నారు. ‘దేశంలో న్యాయసేవా ఉద్యమానికి చోదక శక్తి నిస్సందేహంగా డిస్ట్రిక్ట్ జ్యుడీషియరీయే. న్యాయవ్యవస్థకు ఇది వెన్నెముకలాంటిది. డిస్ట్రిక్ట్ జ్యుడీషియరీలో తమ అనుభవాలను బట్టే ప్రజలు భారత న్యాయవ్యవస్థపై ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకొంటారు’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

