డెహ్రాడూన్: చార్ధామ్ యాత్ర నవంబర్ 18న ముగియనున్నది. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ దేవాలయాన్ని నవంబరు 18న మధ్యాహ్నం 3.33 గంటలకు మూసివేయడంతో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ వివరాలను శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ దేవాలయాల కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ మంగళవారం తెలిపారు. విజయదశమి సందర్భంగా ఈ ముహూర్తాన్ని నిర్ణయించినట్లు తెలిపారు.