సాధారణ జవాన్లతో అగ్నివీర్లు సమానం కాదు
అగ్నివీర్లు.. సాధారణ సైనికులతో సమానం కాదని, ఇద్దరికీ ఒకే విధమైన ‘డెత్ బెనిఫిట్స్' ఉండవని కేంద్రం స్పష్టం చేసింది.
- ఒకే విధమైన ‘డెత్ బెనిఫిట్స్’ రావు: కేంద్రం
న్యూఢిల్లీ: అగ్నివీర్లు.. సాధారణ సైనికులతో సమానం కాదని, ఇద్దరికీ ఒకే విధమైన ‘డెత్ బెనిఫిట్స్’ ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. పాకిస్థాన్ కాల్పుల్లో మరణించిన అగ్నివీర్ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయగా, పై విషయాన్ని దాంట్లో పేర్కొన్నది. సాయు ధ దళాల్లో ‘అమరవీరుడు’ అనే పదాన్ని ఉపయోగించరని కూడా కేంద్రం తెలిపింది. వారి కుటుంబ సభ్యులకు అందే పెన్షన్ ప్రయోజనాల విషయంలో సాధారణ సైనికులతో సమానంగా అగ్నివీర్లకు బెనిఫిట్స్ ఉండవని కేంద్రం బాంబే హైకోర్టుకు తెలియజేసింది.
గత ఏడాది ‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్ సైన్యం జరిపిన మోర్టార్ దాడుల్లో పూంచ్‌లో మురళీ నాయక్ అనే అగ్నివీర్ వీరమరణం పొందాడు. స్వల్పకాలిక నియామక పథకం కింద చేరిన ‘అగ్నివీర్ల’ కుటుంబాలకు దీర్ఘకాలిక పెన్షన్, ఇతర సంక్షేమ ప్రయోజనాల్ని కేంద్రం నిరాకరిస్తున్నదని మురళీ నాయక్ తల్లి కోర్టును ఆశ్రయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chakali Ilamma | మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. రజక సంఘం ఆందోళన
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

