న్యూఢిల్లీ, మే 19: పార్లమెంట్ భద్రతా బాధ్యతలను సోమవారం నుంచి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) చేపట్టనున్నది. పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద మోహరించిన 1,400 మంది సీఆర్పీఎఫ్ భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోనున్నారు.
కొత్త, పాత పార్లమెంట్ కాంప్లెక్స్‌ల భద్రతా వ్యవహారాలను ఇకపై సీఐఎస్ఎఫ్ పర్యవేక్షించనున్నది. గత ఏడాది డిసెంబర్ 13న ఇద్దరు ఆగంతకులు పార్లమెంట్లో చొరబడి గందరగోళం సృష్టించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భద్రతా వ్యవహారాలను సీఆర్పీఎఫ్ నుంచి సీఐఎస్ఎఫ్కి అప్పగించిన సంగతి తెలిసిందే.