Solicitor General | సొలిసిటర్ జనరల్‌గా తుషార్ మెహతా.. వరుసగా నాలుగోసారి నియామకం
భారత సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా పదవీకాలాన్ని కేంద్రం మరో మూడేండ్లు పొడిగించింది. 2014లో నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన గుజరాత్ నుంచి నమ్మకస్తులైన అధికారులను తనతోపాటు తీసుకువచ్చారు.
- అమిత్ షాకు సన్నిహితుడిగా గుర్తింపు
న్యూఢిల్లీ: భారత సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా పదవీకాలాన్ని కేంద్రం మరో మూడేండ్లు పొడిగించింది. 2014లో నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన గుజరాత్ నుంచి నమ్మకస్తులైన అధికారులను తనతోపాటు తీసుకువచ్చారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అత్యంత నమ్మకమైన న్యాయ అధికారిగా తుషార్ మెహతా పేరు అప్పటి నుంచి ప్రముఖంగా వినిపించింది. 2014లో మెహతా అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. అక్టోబర్ 2018లో సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు చేపట్టారు.
2023లో మూడేండ్లపాటు తిరిగి నియమితులయ్యారు. ఇప్పుడు నాలుగోసారి నియమితులై మొత్తం 11 ఏండ్లు పూర్తి చేసుకొన్నారు. 2008లో గుజరాత్ అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా నియమితులైన తర్వాత, అమిత్ షా నిందితుడిగా ఉన్న సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో గుజరాత్ రాష్ర్టానికి మెహతా ప్రధాన న్యాయవాదిగా వ్యవహరించారు. 2014లో ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు అమిత్‌షాను ఈ కేసు నుంచి నిర్దోషిగా విడుదల చేసింది. 2014 నుంచి మెహతా పలు విషయాల్లో ప్రభుత్వ పక్షాన్ని ముందుండి నడిపించారు. సుప్రీంకోర్టులో ఆర్టికల్ 370 రద్దు, ఎలక్టోరల్ బాండ్ల కేసు, రామజన్మభూమి హక్కుల వివాదం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేసు, ఇటీవలి టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌పై ప్రభుత్వ నిషేధం.. ఇలా పలు కేసుల్లో మెహతా కీలక పాత్ర పోషించారు.
అమిత్ షా, మెహతాల మధ్య ఉన్న స్నేహం రహస్యమేమీ కాదు. మెహతా రాసిన రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మెహతా ఏఎస్జీగా ఉన్నప్పుడు 2017లో అమిత్ షా కుమారుడు జై షా తరఫున న్యాయవాదిగా ‘ది వైర్’ న్యూస్ పోర్టల్‌పై దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసును తుషార్ వాదించారు. ప్రైవేట్ కేసులో ప్రభుత్వ న్యాయాధికారి హాజరు కావడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు, అప్పటి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మెహతాకు అనుమతి ఇచ్చినట్టు నివేదికలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

