న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొనడంతో దేశంలోని చమురు, గ్యాస్ నిల్వలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్ర జలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చమురు కంపెనీలు పేర్కొన్నా యి.
అవసరం లేకున్నా కంగారుపడి వాటిని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి.