న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పరీక్షించింది. తాజాగా శుక్రవారం దేశవ్యాప్తంగా అనేకమంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు సందేశాలు పంపించింది. మధ్యాహ్నం 12.19 గంటలకు పెద్ద శబ్దంతో ఎస్ఎంఎస్ రావడంతో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు.
‘ఇది శాంపిల్ టెస్టింగ్ సందేశం. దీన్ని పట్టించుకోవద్దు. విపత్తు సమయంలో ప్రజలను అలర్ట్ చేసేందుకు తీసుకొస్తున్న కొత్త వ్యవస్థ పరీక్షల్లో భాగంగా సందేశాలు పంపించాం’ అని అందులో ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.