న్యూఢిల్లీ, జూన్ 13: ఆధార్‌ను ఉచితంగా అప్డేట్ చేసుకొనే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గతంలో నిర్ణయించిన ఆధార్ ఉచిత అప్డేట్ గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో గడువు తేదీని ఈ ఏడాది సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఉడాయ్) వెబ్సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది.