న్యూఢిల్లీ, జనవరి 9: ‘100 శాతం సెలక్షన్ లేదా 100 శాతం జాబ్ గ్యారంటీ లేదా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల క్వాలిఫై గ్యారంటీ’ అంటూ ప్రకటనలు చేయకూడదని కోచింగ్ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
అభ్యర్థులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇవ్వడం ఆపాలని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఆదేశించింది. ఈ మేరకు ముసాయిదా మార్గదర్శకాలు జారీచేసింది.