న్యూఢిల్లీ, మే 23: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడ్డ పెండింగ్ బకాయిలు రూ.10,461 కోట్లు ఆంధ్రపదేశ్‌కు చెల్లించనున్నామని కేంద్రం ప్రకటించింది! ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా ఆ రాష్ట్ర రెవెన్యూలోటును భర్తీ చేయాలని ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014’లో పేర్కొన్నారు. ఈమేరకు విభజన బకాయిల్ని దశలవారీగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చెల్లిస్తున్నది. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం జగన్ నిరంతర ప్రయత్నాలతో, నిబద్ధతతో ఇది సాధ్యమైందని చెప్పారు. ఏపీ విద్య, వైద్యం, హౌసింగ్ రంగాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.