అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం మరో పేరు మార్పునకు సిద్ధమైంది. అలీగఢ్ పేరును ‘హరిగఢ్’గా మార్చనున్నది. ఈ మేరకు అలీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం ఓ తీర్మానాన్ని ఆమోదించి, సంబంధిత ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.
నగరం పేరు మార్చాలనే డిమాండ్ దీర్ఘకాలంగా ఉన్నదని మేయర్ ప్రశాంత్ సింఘాల్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని యోగి ప్రభుత్వం గతంలో అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్ జిల్లాను ఆయోధ్య జిల్లా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.