BJP | కోల్కతా: కేంద్రంలోని బీజేపీకి కార్పొరేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాల రూపంలో రూ.10,122 కోట్లు వచ్చాయి. 2016-17 నుంచి 2021-22 మధ్య ఆరేండ్ల వ్యవధిలో ఇతర జాతీయ పార్టీలన్నీ ప్రకటించిన మొత్తం విరాళాల కంటే బీజేపీకి మూడు రెట్ల కంటే అధికంగా వచ్చాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ తాజా సంయుక్త నివేదిక వెల్లడించింది.
కాంగ్రెస్కు రూ.1,547.43 కోట్లు, టీఎంసీకి రూ.823.3 కోట్లు వచ్చినట్టు నివేదిక వెల్లడించింది. కమలం పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.5,271.97 కోట్లు(52 శాతం) వచ్చాయని, ఇతర జాతీయ పార్టీలకు రూ.1,783.93 కోట్లు వచ్చాయని తెలిపింది.