న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: జమ్ము కశ్మీరులోని పహల్గాంలో జరిగిన విషాద ఘటన పట్ల ఆర్ట్ ఆఫ్ లివింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నట్లు తెలిపింది. ఇటువంటి క్షణాలలో బాధిత కుటుంబాలను ఓదార్చడానికి మాటలు అందవని, అయితే మన సమిష్టి స్ఫూరి అందించే బలమే గాయాన్ని మాన్పుతుందని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఓప్రకటనలో పేర్కొన్నారు.
ద్వేషానికి వ్యతిరేకంగా మనమంతా కలసికట్టుగానిలబడి మన మానవత్వ గొంతుకను వినిపిద్దామని ఆయన పిలుపునిచ్చారు.