America | న్యూఢిల్లీ: అమెరికాకు వెళ్లేవారికి భారత్లోని అమెరికన్ ఎంబసీ ఓ హెచ్చరికను జారీ చేసింది. అనుమతించిన సమయానికి మించి అమెరికాలో ఉంటే, నిర్బంధంగా అమెరికా నుంచి పంపించేస్తామని లేదా భవిష్యత్తులో అమెరికాలో ప్రవేశించడంపై శాశ్వతంగా నిషేధం విధిస్తామని తెలిపింది. అమెరికాలో 30 రోజులకు మించి ఉన్న విదేశీయులు ఫెడరల్ అథారిటీస్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలని చట్టం నిర్దేశించింది.
రిజిస్టర్ చేయించుకోనివారిపై క్రిమినల్ ఆరోపణలు నమోదు చేసి, జరిమానాలు లేదా జైలు శిక్ష విధించవచ్చునని తెలిపింది. అయితే అక్రమ వలసదారులకు ముందుగా నోటీసు కాని, రక్షణ కోరే అవకాశాన్ని కాని ఇవ్వకుండా, ఇతర దేశాలకు పంపించే కార్యక్రమాన్ని పునరుద్ధరించేందుకు అనుమతి ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యూఎస్ ఫెడరల్ అపీల్స్ కోర్టును కోరింది. కానీ ఈ విజ్ఞప్తిని కోర్టు శుక్రవారం తిరస్కరించింది.