Thai E-Visa | న్యూఢిల్లీ: ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కు థాయ్‌లాండ్ ఈ-వీసా వచ్చే నెల 1 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఇండియన్ ట్రావెలర్స్‌కు ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల వీసా మినహాయింపు నిబంధనలు కొనసాగుతాయి. న్యూఢిల్లీలోని ది రాయల్ థాయ్ ఎంబసీ బుధవారం ఓ ప్రకటనలో ఈ వివరాలను తెలిపింది.
అన్ని రకాల వీసాలను https://www.thaievisa.go.th వెబ్సైట్లో దరఖాస్తు చేసి, పొందవచ్చునని పేర్కొంది. వీసా రుసుమును తిరిగి దరఖాస్తుదారుకు ఇవ్వరు. వీసా రుసుమును స్వీకరించినట్లు రసీదును ఇచ్చిన తేదీ నుంచి సుమారు 14 రోజుల్లోగా ప్రాసెసింగ్ పూర్తవుతుంది.