న్యూఢిల్లీ : భారతీయ పర్యాటకుల కోసం ప్రవేశపెట్టిన వీసా ఫ్రీ ఎంట్రీ పాలసీని థాయ్‌లాండ్ నిరవధికంగా పొడిగించింది. ఈ పాలసీ గడువు ఈ నెల 11తో ముగియవలసి ఉంది. ఈ విధానం ప్రకారం, భారతీయులు థాయ్‌లాండ్‌లో 60 రోజులపాటు వీసా లేకుండా పర్యటించవచ్చు. ఈ సమయాన్ని స్థానిక ఇమిగ్రేషన్ కార్యాలయం ద్వారా మరో 30 రోజుల వరకు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. వీసా ఫ్రీ ఎంట్రీ గడువును నిరవధికంగా పొడిగించినట్లు న్యూఢిల్లీలోని రాయల్ థాయ్ ఎంబసీ ధ్రువీకరించింది.