శ్రీనగర్: పహల్గాం మారణ కాండకు పాల్పడిన ఉగ్రవాదులు మరో మూడు పర్యాటక ప్రదేశాల్లోనూ రెక్కీ నిర్వహించారని ఎన్ఐఎ గురువారం వెల్లడించింది. అరు లోయ, ఒక అమ్యూజ్మెంట్ పార్క్, బెతాబ్ లోయను దాడి కోసం వారు పరిశీలించారని.. అయితే అక్కడ భద్రతా దళాల కాపలా ఉండటంతో బైసరన్ లోయను ఎంచుకున్నారని ఎన్ఐఎ తెలిపింది.
పహల్గాం దాడి చేయడానికి రెండు రోజుల ముందే టెర్రరిస్టులు అక్కడకు చేరుకున్నారని వెల్లడించింది. వారికి నలుగురు నిరాయుధ టెర్రరిస్టులు(ఓవర్ గ్రౌండ్ వర్కర్స్) సహకారం అందించారని చెప్పింది. పహల్గాం కేసుకు సంబంధించి 20 మంది నిరాయుధ టెర్రరిస్టులను, 186 మంది అనుమానితులను ప్రశ్నించినట్టు తెలియజేసింది.