Terrorists Eliminated | జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు. వెంటనే స్పందించిన బలగాలు ఉగ్రవాదుల ప్రయత్నాలను విఫలం చేసింది. జమ్మూకశ్మీర్ పోలీసుల కలిసి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఉగ్రవాదుల మృతిని ఆర్మీ ధ్రువీకరించింది. అంతకుముందు రోజు పూంచ్ సెక్టార్లో అనుమానాస్పద కదలికలను గమనించిన బలగాలు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. పూంచ్ సెక్టార్లోని ఎల్ఓసీ వెంబడి భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త సెర్చ్ ఆపరేషన్ జరుగుతుందని పోలీసులు తెలిపారు.