శ్రీనగర్, మే 15 : జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు గురువారం ఉదయం జరిపిన కాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపొరాలోని నాదర్ట్రాల్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో మరణించిన మృతులు ముగ్గురూ జైషే మహ్మద్ గ్రూప్‌నకు చెందిన ఆసిఫ్ మహ్మద్ షేక్, అమీర్ నజీర్ వనీ, యావర్ అహ్మద్‌లుగా గుర్తించామని, వీరు పుల్వామ్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు.
భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాది అమీర్ నజీర్ వనీ ఎన్‌కౌంటర్‌కు ముందు తన తల్లితో వీడియో కాల్ మాట్లాడాడు. వీడియోలో ఏకే 47 గన్‌తో కన్పించిన అమీర్‌ను వెంటనే లొంగిపొమ్మని అతని తల్లి కోరింది. దానికి అతడు నిరాకరించడమే కాక ‘సైన్యాన్ని ముందుకు రానీ.. అప్పుడు వారి సంగతి చూస్తాను’ అని సమాధానం ఇచ్చి తర్వాత హతమయ్యాడు.