Terror Attacks | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉగ్రదాడులు తగ్గాయని, ముష్కర మూకలకు మోదీ ప్రభుత్వం ముకుతాడు వేసిందంటూ ప్రచారం జరుగుతున్నది. తమ హయాంలో ఉగ్రవాదాన్ని అంతమొందించామంటూ అధికార పార్టీ నేతలు ప్రగల్భాలు పలికారు కూడా. అయితే, వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తే ఇదంతా ఉత్త ముచ్చటగానే తెలుస్తున్నది. 2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత పదకొండేండ్లలో ఒక్క జమ్ముకశ్మీర్‌లోనే 11 ఉగ్రదాడులు జరిగాయి. 103 మంది సైనికులు, 44 మంది పౌరులు మృతి చెందారు. 213 మంది గాయాలపాలయ్యారు.
2014 కంటే ముందు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా దేశంలో పలు ప్రధాన ఉగ్రదాడి ఘటనలు జరిగాయి. అక్షర్ధామ్ ఆలయంపై దాడి (2002), పార్లమెంట్‌పై దాడి (2001), పహల్గాం-అమర్నాథ్ యాత్రికులపై దాడి (2000), ఐసీ 814 విమానం హైజాక్ (1999), కార్గిల్ దాడి-యుద్ధం (1999) ఉన్నాయి.