Sachin Pilot : కతువాలో సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిపై రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ స్పందించారు. జమ్ముకశ్మీర్‌లో తరచూ ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో దాడులు మరింత పెరిగాయని విమర్శించారు.
ఒకవైపు ఉగ్రవాద దాడులు పెరుగుతుంటే.. మరోవైపు కేంద్ర సర్కారు మాత్రం జమ్ముకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని పార్లమెంట్ సాక్షిగా చెబుతోందని పైలట్ ఆవేదన వెలిబుచ్చారు. మన సైనికులు ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయినప్పుడు.. ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు సైనికులు మరణించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని సచిన్ పైలట్ విమర్శించారు. కాగా, జమ్ముకశ్మీర్‌లోని కతువా జిల్లాలో ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.