Indians | అమెరికాలో ఎక్కువగా సంపాదించేది మనోళ్లేనట.. అందుకే ఇండియన్స్‌కు అంత డిమాండ్!
Indians | దేశం ఏదైనా భారతీయులు ప్రతిభాపాటవాలతో అవతలివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. అమెరికాలో మనోళ్ల పాపులారిటీ అంతలా పెరగడానికి అదే కారణం. ఉద్యోగాల కోసం యూఎస్ వెళ్లిన మనోళ్లు అక్కడి స్థానికుల కంటే ఎక్కువ పన్ను చెల్లిస్తున్నారని ఈ ఏడాది జనవరిలో చట్టసభ్యుడు రిచ్ మెక్కార్మిక్ ప్రతినిధుల సభలో వెల్లడించారు.
Indians | న్యూఢిల్లీ: దేశం ఏదైనా భారతీయులు ప్రతిభాపాటవాలతో అవతలివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. అమెరికాలో మనోళ్ల పాపులారిటీ అంతలా పెరగడానికి అదే కారణం. ఉద్యోగాల కోసం యూఎస్ వెళ్లిన మనోళ్లు అక్కడి స్థానికుల కంటే ఎక్కువ పన్ను చెల్లిస్తున్నారని ఈ ఏడాది జనవరిలో చట్టసభ్యుడు రిచ్ మెక్కార్మిక్ ప్రతినిధుల సభలో వెల్లడించారు. దేశ జనాభాలో ఒక్కశాతమే ఉన్న భారతీయ అమెరికన్లు ఆరుశాతం పన్ను చెల్లిస్తున్నారని చెప్పారు. అమెరికాలో ఎక్కువ సంపాదిస్తున్నది మనోళ్లే కావడం మరో విశేషం.
ఎంతమంది ఉన్నారు.. ఎంత సంపాదిస్తున్నారు?
అమెరికాలో ప్రస్తుతం 40 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 16 లక్షల మంది వీసా హోల్డర్లు కాగా, 14 లక్షల మంది న్యూట్రలైజ్డ్ రెసిడెంట్లు. మరో 10 లక్షలమంది అక్కడే పుట్టినవారు. ఇక్కడి భారత కుటుంబ మధ్యస్థ ఆదాయం 1,23,700 డాలర్లు. ఇది దేశ సగటు (63,922 డాలర్లు)కు రెండింతలు. యూఎస్‌లో 79 శాతం మంది ఇండియన్లు కాలేజ్ గ్రాడ్యుయేట్లు కాగా ఇది దేశ సగటు 34శాతం కంటే రెండింతలకుపైనే. మధ్యస్థ ఆదాయంలో తైవాన్, ఫిలిప్పీన్ కుటుంబాలు వరుసగా 97,129 , 95 వేల డాలర్లు ఆదాయంతో భారత్ తర్వాతి స్థానంలో ఉన్నాయి.
కారణాలు ఇవే
భారతీయుల కష్టపడేతత్వంతోపాటు ఐటీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి అత్యధిక వేతనాలు కలిగిన ఉద్యోగాల్లో ఉండడమే వీరి అధిక సంపాదనకు కారణాలని చెబుతూ ఈ ఏడాది జనవరిలో ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా ట్విట్టర్లో ఓ చార్ట్‌ను షేర్ చేశారు. ఇండియన్ అమెరికన్స్ మధ్యస్థ ఆదాయం లక్ష డాలర్లు అంటే ప్రస్తుత మారకపు విలువ ప్రకారం రూ. 81.28 లక్షలుగా ఉంటే చైనీస్ అమెరికన్, పాకిస్థాన్ అమెరికన్ కుటుంబాల మధ్యస్థ ఆదాయం వరుసగా 69,100, 66,200 డాలర్లుగా ఉందని ఆ గణాంకాలు పేర్కొన్నాయి. ఓ ఇంట్లోని కుటుంబ సభ్యుల ఉమ్మడి ఆదాయంలోని సగటును మధ్యస్థ ఆదాయంగా లెక్కిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

