ప్రపంచ దేశాల నోట.. ఓటు చోరీ మాట
‘ఓటు చోరీ’ రాజకీయ నినాదం భారత్‌లో 2025 ఆగస్టు నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓట్ల చోరీ, ఎన్నికల్లో అవకతవకలు, ఎన్నికల సంఘం అక్రమాలపై భారత్‌లో రాహుల్ గాంధీ, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్‌లో ప్రధాని నెతన్యాహులు విమర్శలు చేయడంతో ఈ వివాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలు ఓటింగ్‌కు సంబంధించివే అయినప్పటికీ సందర్భాలు, పరిస్థితులు మాత్రం వేరువేరు.
- ఇది కొత్తదేమీ కాదంటున్న చరిత్ర
- గత రెండు శతాబ్దాలుగా పలు దేశాల్లో కొనసాగుతున్న వివాదం
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ‘ఓటు చోరీ’ రాజకీయ నినాదం భారత్‌లో 2025 ఆగస్టు నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓట్ల చోరీ, ఎన్నికల్లో అవకతవకలు, ఎన్నికల సంఘం అక్రమాలపై భారత్‌లో రాహుల్ గాంధీ, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్‌లో ప్రధాని నెతన్యాహులు విమర్శలు చేయడంతో ఈ వివాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలు ఓటింగ్‌కు సంబంధించివే అయినప్పటికీ సందర్భాలు, పరిస్థితులు మాత్రం వేరువేరు.
ఈసీఐ సహకరిస్తున్నదా?
గత ఏడాది ఆగస్టు 7న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓటు చోరీకి ఈసీఐ సహకరిస్తున్నదని ఆరోపించారు. ఈ సందర్భంగా బెంగళూరు సెంట్రల్ లోక్‌సభలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల డాటాను విశ్లేషించి వివరించారు. అందులో సుమారు 1,00,250 అనుమానాస్పద ఓట్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇందులో డూప్లికేట్ ఓటర్లు, తప్పుడు చిరునామలు, ఒకే చిరునామాలో పెద్దమొత్తంలో ఓట్లు,చెల్లని ఛాయాచిత్రాలు, ఓటరు రిజిస్ట్రేషన్ ఫామ్‌ల దుర్వినియోగాన్ని ఆయన ఎత్తిచూపారు.
ఒక వ్యక్తికి ఒక ఓటు అనే ప్రాథమిక సూత్రానికి వ్యతిరేకంగా ఉన్న ఈ అవకతవకలు, దారుణాలపై ఆయన ఈసీఐని నిలదీశారు. అలాగే పోలింగ్ బూత్‌ల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ల పరిశీలనకు, డిజిటల్ ఓటరు జాబితాలను ఇవ్వడానికి నిరాకరించడంపై ఈసీఐను తీవ్రంగా తప్పుబట్టారు.తర్వాత హర్యానా, మహారాష్ట్రల్లో జరిగిన ఎన్నికల ప్రక్రియలపై కాంగ్రెస్ ఇలాంటి ఆందోళనే వ్యక్తం చేస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించింది.ఈ క్రమంలో ‘ఓట్లు అపహరించే వాడా.. గద్దె దిగు’ అనేది రాజకీయ నినాదంగా మారింది.
19వ శతాబ్దంలోనే ఓటు చోరీ వివాదం
ఓటు చోరీ నినాదం తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ శిబిరం నుంచి వచ్చిందేమీ కాదు. 1986లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు మోసం ఆరోపణలకు సంబంధించి తొలి జాతీయ వివాదాల్లో ముఖ్యమైన వాటిలో ఒకటిగా నిలిచాయి. ఈ ఎన్నికలు రూథర్‌ఫోర్డ్ బీ హేస్, శామ్యూల్ జె టిల్డెన్ మధ్య జరిగాయి. నియంత్రణ ద్వారా ఎన్నికలను తారుమారు చేస్తున్నాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. పలు రాష్ర్టాల్లో వెలువడిన ఫలితాలపై తీవ్ర వివాదం ఎన్నికల కమిషన్ ఏర్పాటుకు దారితీసింది. చివరకు హేస్‌ను విజేతగా ప్రకటించారు. కాలక్రమేణా ఎన్నికల దొంగతనం అనే పదానికి భౌతిక బ్యాలెట్ తారుమారు అనే అర్థం దాటి, ఓటర్లను అణచివేయడం, ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేయడం, ఓటర్ల జాబితాను తారుమారు చేయడం వంటి అంశాలు కూడా చేర్చారు.
2000లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా వివాదానికి దారితీశాయి. జార్జ్ డబ్ల్యూ బుష్ , అల్గోర్ మధ్య జరిగిన ఎన్నికల్లో ఫ్లోరిడాలో బ్యాలెట్ డిజైన్, ఓటింగ్ విధానాలపై తలెత్తిన వివాదాల ద్వారా ఈ ఆందోళనలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. 2020లో జోబైడెన్ చేతిలో ఓడిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ‘దొంగతనాన్ని ఆపండి’ అనే ప్రచారాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఇన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ వాటిని రుజువుచేసేలా అటు కోర్టులకు కానీ, ఇటు ఎన్నికల అధికారులకు కానీ, తర్వాత నిర్వహించిన సమీక్షకులకు కానీ ఎలాంటి నిర్దిష్టమైన ఆధారాలు లభించ లేదు. తాజాగా ఇజ్రాయెల్‌లో జరిగిన ఎన్నికల్లో అరబ్ పార్టీలు విదేశీ నిధుల ప్రవాహం ద్వారా ఎన్నికలను అపహరించాయంటూ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

