అగ్గువకు ఐడీబీఐ!
కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు రూ. 52,878 కోట్లకు ఐడీబీఐ బ్యాంక్‌ను విక్రయించే ప్రక్రియలో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని బిజినెస్ వరల్డ్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. మొదట ఫెయిర్‌ఫాక్స్‌తో పాటు మరో సంస్థ సమర్పించిన సీల్డ్ బిడ్లు, రహస్యంగా నిర్ణయించిన కనీస రిజర్వ్ ధర రూ. 94.42 కంటే చాలా తక్కువగా వచ్చాయి. ఫెయిర్‌ఫాక్స్ తొలుత ఒక్కో షేరుకు రూ. 75 మాత్రమే కోట్ చేసింది. దీంతో అధికారులు అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు.
- బ్యాంక్ విక్రయంలో ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు
- తొలుత ఒక్కో షేరు రూ. 75 మాత్రమే కోట్ చేసిన ఫెయిర్‌ఫాక్స్
- రిజర్వ్ ధర రూ.94 నుంచి 76కు ఎందుకు తగ్గించారు?
- రెండో బిడ్డర్ పేరు ఎందుకు ప్రభుత్వం వెల్లడించడం లేదు?
- ప్రభుత్వ ఉద్యోగులకు ఫెయిర్‌ఫాక్స్‌లో ఉద్యోగాలివ్వడంలో మర్మమేంది?
- నిరుడు బ్యాంక్ లాభం 10 వేల కోట్లు
- లాభాల్లో ఉన్న బ్యాంకును అమ్మాల్సిన అవసరమేంది?
- ఐడీబీఐ స్థిరాస్తుల విలువను సరిగ్గా లెక్కలోకి తీసుకున్నారా: కేటీఆర్
న్యూఢ్లిలీ: కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు రూ. 52,878 కోట్లకు ఐడీబీఐ బ్యాంక్‌ను విక్రయించే ప్రక్రియలో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని బిజినెస్ వరల్డ్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. మొదట ఫెయిర్‌ఫాక్స్‌తో పాటు మరో సంస్థ సమర్పించిన సీల్డ్ బిడ్లు, రహస్యంగా నిర్ణయించిన కనీస రిజర్వ్ ధర రూ. 94.42 కంటే చాలా తక్కువగా వచ్చాయి. ఫెయిర్‌ఫాక్స్ తొలుత ఒక్కో షేరుకు రూ. 75 మాత్రమే కోట్ చేసింది. దీంతో అధికారులు అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు.
కనీసం రిజర్వ్ ధరను రూ. 75.99కు తగ్గించారు. అయితే ఈ నిర్ణయాన్ని బహిరంగంగానే తీసుకున్నట్టు చూపించారు. ఫెయిర్‌ఫాక్స్‌తో పాటు మరో బిడ్డర్‌ను కొత్తగా బిడ్లు సమర్పించాలని కోరారు. అయితే ఆ రెండో బిడ్డర్ పేరును వెల్లడించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర హోంశాఖ ఆ సంస్థను తర్వాత తిరస్కరించినట్టు సమాచారం. ఈసారి ఫెయిర్‌ఫాక్స్ ఒక్కో షేరుకు రూ. 81 చొప్పున బిడ్ వేసింది. అనంతరం ఇదే తమరి చివరి ఆఫర్ అని, అంగీకరించకపోతే బిడ్డింగ్ నుంచి తప్పుకుంటామని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం ఆ బిడ్‌ను అంగీకరించింది.
అధిక ఇంధన ధరల కారణంగా కేంద్ర ప్రభుత్వంపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక తగ్గిపోవడం, అంతర్జాతీయ ఇంధన సంక్షోభాల కారణంగా భారత కరెన్సీపై ఒత్తిడి పెరుగడంతో అత్యవసరంగా ఈ విక్రయం చేపట్టాల్సి వచ్చిందంటూ అంతర్గత నోట్లో పేర్కొన్నది. ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి సంబంధించిన నిబంధనలు, విలువ నిర్ధారణ పద్ధతిని మార్చడానికి జనరల్ ఫైనాన్షియల్ రూల్స్‌ను ఆధారంగా చూపినట్టు బిజినెస్ వరల్డ్ కథనం పేర్కొన్నది.
ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో గతంలో కార్యదర్శిగా పనిచేసిన సత్యనారాయణ మొహంతి ఈ వ్యవహారంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బిడ్లను పరిశీలించి, తెరిచిన తర్వాత ప్రభుత్వం బిడ్డింగ్ నిబంధనలను మార్చితే, కొత్త నిబంధనల ప్రకారం బిడ్లు వేయాలనుకునే ఇతర సంస్థలకు కూడా అవకాశం కల్పించేందుకు మొత్తం ప్రక్రియను మొదటి నుంచి తిరిగి ప్రారంభించాల్సి ఉంటుందని అన్నారు. కానీ ఐడీబీఐ బ్యాంక్ విక్రయ ప్రక్రియలో కార్యదర్శుల కోర్ గ్రూప్ ఈ విధానాన్ని అనుసరించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ ఒప్పందాల్లో పారదర్శకత ఏదీ?: కాంగ్రెస్
ఐడీబీఐ బ్యాంక్ విక్రయంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఒప్పందాల్లో పారదర్శకతపై కాంగ్రెస్ పార్టీ శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 10,000 కోట్ల లాభాన్ని నమోదు చేసిన, చారిత్రక నేపథ్యం ఉన్న సంస్థను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ సంస్థకు విక్రయించడానికి కారణమేంది? అంటూ జైరాం రమేశ్ ప్రశ్నించారు.
ఎల్ఐసీలో స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న గురుమూర్తి మహాలింగం, ఫెయిర్‌ఫాక్స్ నియంత్రణలో ఉన్న థామస్ కుక్ ఇండియా సంస్థ బోర్డులోనూ ఏకకాలంలో ఏడు నెలలపాటు సభ్యుడిగా కొనసాగారని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలోనే ఎల్ఐసీ తన వద్ద ఉన్న ఐడీబీఐ బ్యాంకులోని 30.24 శాతం వాటాను విక్రయించే ప్రక్రియను ప్రారంభించిందని, అదే సమయంలో ఫెయిర్‌ఫాక్స్ కూడా బ్యాంక్ కొనుగోలు కోసం బిడ్డర్లలో ఒకటిగా ఉన్నదని మీడియా కథనాన్ని ఉటంకిస్తూ తెలిపారు.ప్రభుత్వం మొదట నిర్ణయించిన కనీస ధరకంటే సుమారు రూ. 8,800 కోట్లు తక్కువకు బ్యాంకును విక్రయించడం ఎలా సాధ్యమైంది? ఈ నిర్ణయం తీసుకోవాలని ఎవరు సూచించారు? ఎందుకు తీసుకున్నారు అని అడిగారు. అంతేకాకుండా, ఐడీబీఐ విక్రయ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఫెయిర్‌ఫాక్స్ గ్రూపునకు చెందిన సంస్థల్లో గతంలో ప్రభుత్వ, నియంత్రణ సంస్థల్లో పనిచేసిన పది మంది ఉన్నతాధికారులకు ఉద్యోగాలు ఎలా లభించాయని ప్రశ్నించారు.
అన్ని నిబంధనలు పాటించాం: నిర్మల
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం చేసిన విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఐడీబీఐ బ్యాంక్ తమకు అప్పగించే సమయానికి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నదని ఆమె అన్నారు. వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో అన్ని నిబంధనలు పాటించామని చెప్పారు.
2017-18లో దివాలా అంచుకు ఐడీబీఐ
2017-18లో ఐడీబీఐ బ్యాంకు దాదాపు పతనం అంచుకు చేరుకున్నది. ఆ సమయంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు దాదాపు 28 నుంచి 30 శాతానికి చేరుకున్నాయి. ఆర్బీఐ కఠినమైన ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ విధానాన్ని అమలు చేయడంతో బ్యాంక్ కార్యకలాపాలపై తీవ్ర పరిమితులు విధించింది. 2019 జనవరిలో ఎల్ఐసీ రూ. 21,624 కోట్ల పెట్టుబడిని ఐడీబీఐ బ్యాంఖలో పెట్టి 51 శాతం నియంత్రణ వాటాను సొంతం చేసుకున్నది.
ప్రైవేటీకరణ తక్షణమే ఆపండి
- బ్యాంకు ఉద్యోగుల పోరాటానికి మద్దతు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Kt Rama Rao
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వరంగ బ్యాంకులు దేశ ప్రజల ఉమ్మడి సంపద అని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ఐడీబీఐ ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ శనివారం ఎక్స్ వేదికగా చేసిన విజ్ఞప్తికి కేటీఆర్ పూర్తి మద్దతు ప్రకటించారు. బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియలో ప్రభుత్వ తీరును ఎండగడుతూ కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు.
ఐడీబీఐ అసలు విలువను మారెట్లో ఉద్దేశపూర్వకంగా తకువ చేసి చూపిస్తున్నారనే నివేదికలపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. వేలంలో వచ్చిన బిడ్లు నిర్ణయించిన రిజర్వ్ ధర కంటే తకువకు పడిపోయినప్పుడు, విలువ నిర్ధారణ పద్ధతులు, నిబంధనలను ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ ప్రక్రియలో అసలు పారదర్శకత ఎకడ ఉన్నదని, ఎవరి ప్రయోజనాల కోసం నిబంధనలు సడలిస్తున్నారని నిలదీశారు. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రధాన ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా ఐడీబీఐకి వేల కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని కేటీఆర్ గుర్తుచేశారు.
ఈ రియల్ ఎస్టేట్ ఆస్తుల మారెట్ విలువను సరిగ్గా లెకగట్టారా.. లేదా? అని ప్రశ్నించారు. బ్యాంకు ఉద్యోగులు తమ భవిష్యత్తుపై లేవనెత్తుతున్న న్యాయమైన ఆందోళనలను కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దేశానికి ఎనలేని సేవలందించిన ఒక ప్రతిష్టాత్మక బ్యాంకును ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడానికి ఎందుకంత తొందరపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజాధనంతో నిర్మితమైన ప్రభుత్వ రంగ బ్యాంకును ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే ముందు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐడీబీఐ ఉద్యోగుల పోరాటానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తేల్చిచెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

