జమ్ము కశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి
జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇటీవల చేపట్టిన క్యాబినెట్ విస్తరణపై పాలక పక్షం నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన 24 మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తమైంది. వీరిలో 18 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం లోలబ్ ఎమ్మెల్యే ఖైసర్ జంషీద్ ఇంట్లో సమావేశం కాగా ఆరుగురు ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సీఎం సలహాదారు నసిర్ సోగామి, నలుగురు కొత్త మంత్రులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
- నలుగురు మంత్రులు, సీఎం సలహాదారును తొలగించాలని డిమాండ్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇటీవల చేపట్టిన క్యాబినెట్ విస్తరణపై పాలక పక్షం నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన 24 మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తమైంది. వీరిలో 18 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం లోలబ్ ఎమ్మెల్యే ఖైసర్ జంషీద్ ఇంట్లో సమావేశం కాగా ఆరుగురు ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సీఎం సలహాదారు నసిర్ సోగామి, నలుగురు కొత్త మంత్రులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
క్యాబినెట్లోనూ భారీ మార్పులు చేపట్టాలని కోరారు. సోగామి పార్టీ విధుల్లో జోక్యం చేసుకొంటూ నాయకత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. తమ డిమాండ్లపై పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను, సీఎం ఒమర్ అబ్దుల్లాను కలవాలని వారు నిర్ణయించుకొన్నారు. తాము పార్టీని వీడబోమని ప్రతిజ్ఞ చేశారు. కొందరు పార్టీ అంతర్గత పనితీరును బలహీనపరుస్తున్నారని అసంతృప్త ఎమ్మెల్యేలు విమర్శించారు.
జర్నలిస్ట్‌ను పెండ్లాడిన ఒమర్
పాత్రికేయురాలు నిధీ రాజ్దాన్ను తాను పెండ్లి చేసుకొన్నట్టు జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఆమెతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘నిన్న కొత్త ప్రయాణం ప్రారంభమైంది’ అని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

