ఒక్కో అండం రూ. 3 లక్షలు!
నిరుపేద మహిళలే లక్ష్యంగా చేసుకొని, అక్రమంగా అండాలు సేకరించి వ్యాపారం చేస్తున్న ఓ ఘరానా ముఠా గుట్టును మల్కాజిగిరి పోలీసులు రట్టుచేశారు.
- డోనర్ యువతులకు ఇచ్చేది మాత్రం రూ. 30 వేలు మాత్రమే
- డబ్బు ఆశ చూపి వ్యాపారం.. హాస్టళ్ల ముసుగులో దందా
- ఘరానా ముఠా గుట్టురట్టు..9 మంది నిందితుల అరెస్ట్
- వివిధ రాష్ట్రాలకు చెందిన 49 మంది మహిళలకు విముక్తి
హైదరాబాద్ సిటీబ్యూరో/మారేడుపల్లి, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): నిరుపేద మహిళలే లక్ష్యంగా చేసుకొని, అక్రమంగా అండాలు సేకరించి వ్యాపారం చేస్తున్న ఓ ఘరానా ముఠా గుట్టును మల్కాజిగిరి పోలీసులు రట్టుచేశారు. బేగంపేట, సరూర్‌నగర్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్, మలాజిగిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
అండాల వ్యాపారం చేస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి, వివిధ రాష్ట్రాలకు చెందిన 49 మంది మహిళలకు విముక్తి కల్పించారు. ఈ మేరకు వివరాలను ఆదివారం సికింద్రాబాద్‌లోని మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి సీపీ బీ సుమతి వెల్లడించారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి పేద మహిళలను డబ్బు ఆశ చూపి హైదరాబాద్ తీసుకువచ్చి, అద్దె ఇండ్లు, హాస్టళ్లలో ఉంచి, ఐవీఎఫ్, ఫర్టిలిటీ కేంద్రాల్లో అండం సేకరణ ప్రక్రియకు పంపుతున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీపీ వివరించారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన అమిత్ శర్మ (44) ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడని, కోల్‌కతాకు చెందిన నిఖత్ పర్వీన్ (31)తో కలిసి బేగంపేట, ప్రకాశ్‌నగర్‌లో రెండేండ్లుగా ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని అండాల దందా సాగిస్తున్నట్టు వివరించారు. నాంపల్లికి చెందిన వ్యాపారి ఎమిరిశెట్టి దుర్గాప్రసాద్ (42) సరూర్‌నగర్ కేంద్రంగా మరో ముఠా నడిపిస్తున్నాడని, అండాలు దానం చేస్తే రూ.20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఇస్తామని ఆశ చూపుతున్నారని, ఒక్కో మహిళ నుంచి సేకరించిన అండాల ద్వారా ఫర్టిలిటీ కేంద్రాల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిపారు.
ప్రధాన నిందితులతో పాటు సికింద్రాబాద్‌కు చెందిన సబ్ ఏజెంట్ రేష్మా ఖాతూన్ (26), ఏఆర్టీ కో ఆర్డినేటర్లు మేఘావత్ శ్రీనివాస్ అలియాస్ సోను (23), ప్రదీప్ ( 27), విజయ్ భగవాన్‌రావు సాలుంకే (46), పంకజ్ పోనీ (52), షేక్ పర్వీన్ (42)ను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఈ అక్రమ కార్యకలాపాల్లో ఫర్టిలిటీ కేంద్రాల పాత్రపైనా విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

