న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఆగస్టు 29వ తేదీని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించనున్నారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. కొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేయడం గమనార్హం.
‘మన సంస్కృతి, సంప్రదాయాలతో అనుసంధానం కావడానికి మాతృ భాష చాలా శక్తివంతమైన మాధ్య మం. భారత్లో ఎంతో వైభవోపేతమైన భాష తెలుగు. అందుకే ఈ నెల 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుందాం. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు’ అని మోదీ పేర్కొన్నారు.