ఆదివారం 24 జనవరి 2021
National - Dec 27, 2020 , 17:35:15

కరోనాపై తప్పుడు సమాచారమిచ్చిన బ్రిటన్‌ ప్రయాణికులు

కరోనాపై తప్పుడు సమాచారమిచ్చిన బ్రిటన్‌ ప్రయాణికులు

న్యూఢిల్లీ : ఇటీవల బ్రిటన్‌ నుంచి తెలంగాణకు తిరిగి వచ్చిన పలువురు అధికారులతో సహకరించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. విమానం దిగిన తర్వాత విమానాశ్రయంలో తెలంగాణ అధికారులు చేపడుతున్న పరీక్షలకు అందరూ సహకరించాలని ప్రభుత్వం మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేసింది. పోలీసులు ,ఇతర అధికారులతో సహకరించనిపక్షంలో ఇతరులకు ఈ వైరస్‌ సోకే ప్రమాదాన్ని అరికట్టడం ఇబ్బందికరంగా తయారవుతుందని అధికారులు చెప్తున్నారు. ఇటీవల బ్రిటన్‌ నుంచి తెలంగాణకు వచ్చిన దాదాపు 184 మంది తప్పుడు ఫోన్‌ నంబర్లు, చిరునామాలు ఇచ్చినట్లు తెలిసింది. అలాగే, 279 మంది ప్రయాణికులను గుర్తించలేదని రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు. బ్రిటన్ నుంచి తిరిగొచ్చిన ప్రయాణికుల్లో 59 కొత్త కేసులు నమోదయ్యాయి. గత ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా నమోదైన ఈ సంఖ్య 119 మందికి పెరిగింది. 92 మంది పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.

ఆందోళన అనవసరం : శ్రీనివాసరావు

కొత్త రకం వైరస్ బారిన పడిన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పబ్లిక్ హెల్త్ రాష్ట్ర డైరెక్టర్ జీ శ్రీనివాసరావు అన్నారు.

"అప్రమత్తంగా ఉంటూ మాస్కును సరిగ్గా వాడుతూ నిర్ణీత దూరాన్ని అనుసరించండం చాలా అవసరం. అలాగే, క్రమం తప్పకుండా చేతులు కడుక్కొంటూ శుభ్రత పాటించాలి" అని శ్రీనివాసరావు చెప్పారు. బ్రిటన్‌ నుంచి వచ్చిన 1,216 మందిలో 937 మందిని అంటు వ్యాధికి గురైనట్లు గుర్తించి పరీక్షించామని, శనివారం ఇద్దరు వ్యక్తులు పాజిటివ్‌గా ఉన్నారని తెలిపారు.  ట్రావెల్ హిస్టరీ ఉన్న వ్యక్తులు తమ వివరాలను ఆరోగ్య శాఖకు నివేదించాలని రావు విజ్ఞప్తి చేశారు. తద్వారా వైద్య ఆరోగ్య సిబ్బంది వారి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించవచ్చన్నారు. వైరస్‌ను అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నదని ఆయన చెప్పారు. డిసెంబర్ 9 తర్వాత బ్రిటన్‌ నుంచి నేరుగా రాష్ట్రానికి వచ్చిన లేదా యూకే ద్వారా ప్రయాణించిన వ్యక్తులు 040-24651119 లేదా వాట్సాప్ నంబర్‌ 9154170960 కు కాల్ చేసి తమ వివరాలను అందించాలని ఆయన కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, కొవిడ్‌-19 యొక్క కొత్త జాతి బారిన పడిన 18 మందితో సన్నిహిత సంబంధాలలో ఉన్న 79 మందిని నిర్బంధంలో ఉంచారు. వారి ఆరోగ్య పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పాజిటివ్ పరీక్షించిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) కి పంపినట్లు సమాచారం.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo