అగర్తల: టిప్రా మోత ఎమ్మెల్యే ఫిలిప్ కుమార్ రియాంగ్‌ను బెదిరించిన కేసులో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కుమారుడితోసహా నలుగురు వ్యక్తులను త్రిపుర పోలీసులు ఈనెల 2న అరెస్టు చేశారు. అగర్తలలోని ఐఎల్ఎస్ దవాఖాన సమీపంలో ఉన్న ఎమ్మెల్యే హాస్టల్ వద్ద ప్రభుత్వ నివాసంలో ఈ బెదిరింపులు చోటుచేసుకోవడంతో రియాంగ్ తన సహచర ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తలదాచుకున్నారు.
సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో తన 209 నంబర్ ప్రభుత్వ క్వార్టర్లో ఓ ప్రైవేట్ సంభాషణ జరుగుతున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న వీరు తనను, తన కుటుంబాన్ని చంపివేస్తామని బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రియాంగ్ ఆరోపించారు.