Tej Pratap Yadav : ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తుండగా.. మాజీ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే రాష్ట్రీయ జనతా దళ్(RHD) పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన ఏ పార్టీ అండ లేకుండానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో తర్వలో జరుగబోయే ఎలక్షన్లో తనకు టికెట్ ఇస్తే సరే.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని శనివారం తేజ్ ప్రతాప్ హెచ్చరించారు. మహువా నియోజకవర్గం నుంచి తాను బరిలో ఉంటానని ఆయన తెలిపారు.
‘నేను మహువా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నా. నాకు, నా టీమ్‌కు ఇక్కడి ప్రజలు ఎంతో మద్దతు ఇస్తున్నారు. యువత కూడా మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మహువాలో ఆర్జేడీ నాయకుడు తప్ప మరొకరు పోటీ చేస్తే ఓట్లు వేయమని వాళ్లంతా అంటున్నారు. అందుకే.. పార్టీ నాకు టికెట్ ఇస్తే పోటీ చేయాలని అనుకుంటున్నా. అలాకాని పక్షంలో ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటాను’ అని అని మీడియా సమావేశంలో తేజ్ ప్రతాప్ వెల్లడించారు.
आज मेरे पटना स्थित आवास पर टीम तेज प्रताप यादव की एक दिवसीय बैठक सम्पन्न हुआ। जिसमें हमारे साथी मदन यादव जी के साथ हज़ारों की संख्या में आये हुए युवा, महिला और बुजुर्गों ने टीम तेज प्रताप यादव को जॉइन किया।
मैं सभी साथियों को टीम तेज प्रताप यादव से जुड़ने पर हार्दिक स्वागत एवं… pic.twitter.com/jQrOd3RvuJ
— Tej Pratap Yadav (@TejYadav14) July 26, 2025
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడైన తేజ్ ప్రతాప్ ఈమధ్యే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు. భాగస్వామి అయిన అనుష్క యాదవ్‌తో 12 ఏళ్లుగా ప్రేమలో ఉన్నానంటూ ఆయన మే నెలలలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌పై తీవ్ర దుమారం రేపడంతో పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంది. అయితే.. బిహార్ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈమధ్యే తాను మహువా నుంచి పోటీ చేస్తానని చెప్పారు. దాంతో, తేజ్ ప్రతాప్ ఆ స్థానాన్ని తాను ఆశిస్తున్నాని .. ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గానైనా నామినేషన్ వేస్తానని స్పష్టం చేశారు.