జైపూర్: అతనికి నిండా 20 ఏండ్లు కూడా లేవు. పూటుగా తాగాడు. కోరికలు రంకెలేశాయి. కామంతో అతని కళ్లు మూసుకుపోయాయి. పక్కింట్లో ఉన్న వృద్ధురాలిపై లైంగిక దాడి చేశాడు. అయితే అది విఫలమవడంతో ఆమెను హత్య చేశాడు. అక్కడితో ఆగకుండా ఆమె మృతదేహాన్ని రేప్ చేసి తన కోరికను తీర్చుకున్నాడు. ఈ అమానవీయ చర్య రాజస్థాన్‌లో జరిగింది.
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో ఉన్న పిలిబంగా టౌన్‌కు చెందిన 19 ఏండ్ల కుర్రాడు.. తన ఇంటి పక్కనే ఉన్న ఓ 60 ఏండ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేయబోయాడు. అయితే అది విఫలమవడంతో ఆమెను చంపి.. ఆ మృతదేహాన్ని అనుభవించాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. ఆ సమయంలో టీనేజర్ మద్యం మత్తులో ఉన్నాడని, వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించి ఆమై హత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.