Air India Express | ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం.. తమిళనాడులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Express | ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని తమిళనాడులోని ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానంలోని 137 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది.
చెన్నై: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని తమిళనాడులోని ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానంలోని 137 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. శనివారం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు బయలుదేరింది. అయితే సాంకేతిక లోపం వల్ల ఆ విమానాన్ని తమిళనాడులోని తిరుచిరాపల్లికి మళ్లించారు. అక్కడి ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. అందులో ఉన్న 137 మంది ప్రయాణికులను మరో విమానంలో బెంగళూరు చేర్చే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేశారు.
కాగా, శుక్రవారం కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలోని పవర్ యూనిట్లో అగ్ని ప్రమాదం హెచ్చరిక వెలువడింది. దీంతో ఆ విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. 175 మంది ప్రయాణికులున్న ఆ విమానాన్ని ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

