Korba Express | కోచువేలి – కోర్బా ఎక్స్ప్రెస్ రైలు మంచిర్యాల జిల్లాలో నిలిచిపోయింది. రైలు విద్యుత్ తీగ తెగిపోవడంతో బెల్లంపల్లి – మందమర్రి మధ్య కోర్బా ఎక్స్ప్రెస్ ఆగిపోయింది. దాంతో ఆ మార్గంలో పలు రాకపోకలపై ప్రభావం పడుతున్నది. కాగజ్నగర్ రైల్వేస్టేషన్లో కాగజ్నగర్, దానాపూర్, అండమాన్ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. దాదాపు రెండున్నర గంటలుగా రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులుపడుతున్నారు. రైలు కోర్బా నుంచి కోచువేలి వెళ్తున్నది. బెల్లంపల్లి రైల్వేస్టేషన్ దాటిన తర్వాత రైలుకు సంబంధించిన విద్యుత్ తీగ తెగిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ తీగను సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.